nothing
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఏమీలేదు.
- I have nothing నా వద్ద యేమీ లేదు.
- there is nothing in the dish ఆ తట్టలో యేమి లేదు.
- I know nothing about it అందున గురించి నా కేమీ తెలియదు.
- you have nothing to do with this యిది నీజోలి కాదు, దీనితో నీకు నిమిత్తము లేదు.
- his property is now reduced to nothing వాడి ఆస్తి యిప్పట్లో క్షయించినది.
- these difficulties will be reduced to nothing యీ తొందరలు అంతా మాయమైపోను, యేమీ లేకపోను.
- do you call this nothing? యిది వొకటీ కాదా, యిది విశేషము కాదా.
- I know nothing but this నాకు యిదే తెలుసును, యింతకు మించినది నేను యేమిన్ని యెరగను.
- they have nothing వాండ్లకు యేమిన్ని లేదు.
- he reads nothing but English యింగ్లీషే చదువుతాడు.
- there is nothing the matter with him అతనికి వొళ్ళు యేమీ లేదు, హాయిగా వున్నాడు.
- this signifies nothing యిది వొక విశేషము కాదు, యిది ముఖ్యము కాదు.
- thats nothing to us అది మాకు చింత లేదు, అది మాకు లక్ష్యము లేదు.
- they who have nothing shall recieve nothing వొకటి లేని వాడికి వొకటీ దొరకదు.
- I will have nothing to do with you నీకు నాకు సరి, నీకు నాకు తీరినది.
- nothing can be more foolish యింతకంటే పిచ్చి వేరే లేదు.
- nothing could be worse for the patient than to bathe ఆ రోగి కి స్నానం చేయడానకన్నా వేరే చెరుపు లేదు.
- they think nothing of telling lies అబద్ధాలు ఆడడము వాండ్లకు వొక యిది కాదు, అనగా సాధారణము, అవలీల గా అబద్ధాలాడుతారు.
- nothing but water వట్టి నీళ్ళు.
- he thought nothing of beating his wife భార్యను కొట్టడము వాడికి అతి సులభము.
- I have got nothing for the last ten days పది దినములుగా నాకేమీ చిక్కలేదు.
- he ate a mere nothing యేమీ లేదు, రవంత తిన్నాడు.
- this came to nothing అది నిష్ఫలమైనది.
- they have sold the goodsfor nothing ఆ సరుకును అమ్మడములో వాండ్లకు వట్టి దండగ వచ్చినది.
- Iwill do nothing of the kind అలాటి పని యెంత మాత్రమున్ను చేయను.
- I should like nothing better నాకు యింతకంటే మంచిది వద్దు, నాకు యిదే కావాలి.
- but now he is nothing వాడు యిప్పుడు యేమీ లేదు, అనగా అప్రయోజకుడైపోయినాడు.
- I am nothing before him వాడి ముందర నేను యెంత మాత్రము.
- for nothing (causelessly, without equivalent) వూరికే, నిర్నిమిత్తముగా, వ్యర్ధముగా.
- he is angry about nothing వాడు వూరికే కోపము చేస్తాడు.
- good for nothing కొరగాని, పనికిమాలిన.
- they think nothing of him అతణ్ని ఉపేక్ష చేస్తున్నారు, లక్ష్య పెట్టరు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).